- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ ఇండియా ప్రయాణికుడికి పాజిటివ్.. 40 మంది క్వారంటైన్‌లోకి
by vinod kumar |
X
న్యూఢిల్లీ: మంగళవారం ఎయిర్ ఇండియా విమానంలో ఢిల్లీ నుంచి లూధియానాకు వెళ్లిన ఓ ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ విమానంలో ప్రయాణించిన 36 మంది ప్రయాణికులతోపాటు నలుగురు క్యాబిన్ క్రూ సిబ్బందిని క్వారంటైన్‌లోకి పంపారు. దేశీయ విమాన సేవలు ప్రారంభమైన రెండో రోజు(మంగళవారం) ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని లూధియానాకు సదరు ప్రయాణికుడు ఏఐ91837 విమానంలో ప్రయాణించాడని ఎయిర్ ఇండియా తెలిపింది. కరోనా పాజిటివ్ అని తేలగానే మొత్తం 40 మందిని పంజాబ్ ప్రభుత్వ నిబంధనల మేరకు క్వారంటైన్‌లోకి పంపినట్టు వెల్లడించింది. దేశీయ విమాన సేవలు ప్రారంభమైన తొలి రోజూ(సోమవారం) చెన్నై నుంచి కోయంబత్తూర్‌కు ఇండిగో ఫ్లైట్‌లో వెళ్లిన ప్రయాణికుడికి కరోనా పాజిటివ్ గా తేలిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story