మోత్కూరులో కరోనా విజృంభణ

దిశ, తుంగతుర్తి: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలో కరోనా వైరస్‌ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అనాజీపురం గ్రామంలో ఒకరికి పాజిటివ్ రావడంతో అధికారులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో అధికారులు శానిటేషన్ చేసి, ప్రైమరీ కాంట్రాక్టులు ఉన్నావారినీ గుర్తించే పనిలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితమే మండల కేంద్రంలో అంగడిబజార్‌కు చెందిన మహిళకు కరోనా నిర్థారణ అయ్యింది. దీంతో మండలంలో కరోనా పేషంట్ల సంఖ్య 3కు చేరడంతో ప్రజలు హైరానా పడుతున్నారు.

Advertisement