- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా చికిత్సకు కొత్త ధరలు ఇవే.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రతాపం క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్స్‌లలో కరోనా చికిత్సకు ధరలు ఫిక్స్ చేసింది. NABH అక్రిడేషన్ కలిగిన ఆసుపత్రులు నాన్ క్రిటికల్ కేర్(ఆక్సిజన్ లేకుండా) కోసం రోజుకు రూ. 4000, అక్రిడేషన్ లేని ఆసుపత్రులు రూ.3600 వసూలు చేయాలని ఉత్వర్వుల్లో పేర్కొంది.
ఆక్సిజన్‌తో కూడిన కరోనా ట్రీట్‌మెంట్ ఇస్తే.. అక్రిడేషన్ గల హాస్పిటల్స్ రోజుకు రూ.6,600, అక్రిడేషన్ లేని హాస్పిటల్స్ రోజుకు రూ.5,850 వసూలు చేయాలని తెలిపింది. ఇక అక్రిడేషన్ గల ఆస్పత్రులు ఐసీయూలో చికిత్స అందిస్తే రోజుకు రూ.12 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రులు రూ.10,800 వసూలు చేయాలని స్పష్టం చేసింది.
ఆక క్రిటికల్ కేర్ చికిత్స (ఐసీయూ+వెంటిలేటర్) కోసం అక్రిడేషన్ గల ఆస్పత్రులు రూ.16 వేలు, అక్రిడేషన్ లేని ఆస్పత్రులు రూ.14,400 వసూలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇటీవల కరోనా చికిత్స కోసం ఆస్పత్రులు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్న క్రమంలో.. ధరలు ఖరారు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.