ప్రొఫెసర్‌కు కరోనా పాజిటివ్

దిశ, అమరావతి బ్యూరో: గుంటూరు జీజీహెచ్ లో విధులు నిర్వహిస్తున్న ఓ ప్రొఫెసర్ కు కరోనా సోకింది. ఇది ఆసుపత్రి వర్గాలను కలవరానికి గురి చేసింది. ఇప్పటి వరకు సహాయ ప్రొఫెసర్లకు, నర్సులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా ప్రొఫెసర్ కు పాజిటివ్ రావడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి సంబంధిత వార్డుకు పంపించాలని నిర్ణయించారు.

Advertisement