ఖ‌మ్మం ఆస్ప‌త్రిలో ప‌నిచేసే వ్య‌క్తికి క‌రోనా

దిశ‌, పాలేరు: ఖ‌మ్మం జిల్లా కూసుమంచి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడికి కరోనా సోకింది. ఇతను ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. గత కొన్ని రోజులుగా ఇతను కరోనా లక్షణాలతో బాధపడుతుండగా టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం.

Advertisement