తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా

by Anukaran |   ( Updated:2020-07-20 03:11:17.0  )
తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
X

దిశ, కుత్బుల్లాపూర్ : అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ వెంటాడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా చికిత్స అనంతరం కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ కు కరోనా సోకింది. ఆయనతో పాటు భార్య, కుమారుడు, పని మనిషికి పరీక్షలు చేయగా పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు జిల్లా సహాయ వైద్యాధికారి డా.ఆనంద్ తెలిపారు. గత నాలుగు రోజుల క్రితం పొడి దగ్గు, జలుబు రావడంతో పరీక్షల కోసం నమూనాలను వైద్యులకు అందజేశారు. ఆదివారం ఆదివారం సాయంత్రం పరీక్షలకు సంబంధించిన రిపోర్టుల్లో పాజిటివ్ గా తేలింది.

Advertisement

Next Story