కడప జైల్లో ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు

by srinivas |
కడప జైల్లో ప్రభాకర్ రెడ్డికి కరోనా పరీక్షలు
X

దిశ, ఏపీ బ్యూరో: బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా రిజిస్ట్రేషన్ చేయించి పలువురికి విక్రయించారన్న కేసులో అరెస్టయిన దివాకర్‌ ట్రావెల్స్‌ యజమాని జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్‌ రెడ్డికి కడప సెంట్రల్ జైలులో కరోనా పరీక్షలు నిర్వహించారు.

టెస్ట్ రిపోర్టులు సోమవారం సాయంత్రం లేదా మంగళవారం రానున్నాయి. మరోవైపు వారిని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అనంతపురం జిల్లా తాడిపత్రికి రానున్నారు. కాగా, ఏసీబీ కోర్టు వీరికి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story