- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30న పోలింగ్.. టీకా తీసుకోని వారు ఇలా చేయాల్సిందే : ఎన్నికల కమిషన్
దిశ ప్రతినిధి, కరీంనగర్ : పోలింగ్ తేది సమీపించడంతో ఎన్నికల అధికారులు అభ్యర్థులకు, పోలింగ్, కౌంటింగ్ ఏజెంట్లకు, విధుల్లో పాల్గొనే యంత్రాంగానికి కొవిడ్ నిబంధనలు పాటించేందుకు పకడ్బంధీ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 29న రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో టెస్ట్ రిపోర్టులను అందించాల్సిందేనని స్పష్టం చేశారు. పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
అయితే, మొదటి డోసు తీసుకున్న తరువాత కొవిడ్ నిబంధనల ప్రకారం పీరియడ్ పూర్తి కానట్టయితే ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు 72 గంటల ముందు తీసుకొని రిటర్నింగ్ అధికారికి అప్పగించాలని వెల్లడించారు. కౌంటింగ్‌కు హాజరయ్యే ఏజెంట్లు కూడా ఇదే పద్దతిలో 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని స్పష్టం చేశారు. ఫస్ట్ డోస్ కూడా తీసుకోని వారు ఉన్నట్టయితే 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకొని రిపోర్టులను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అప్పగించాల్సి ఉంటుంది. ప్రతీ ఒక్కరూ కూడా హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొని రిపోర్టులను ఈ నెల 29న ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో అప్పగించాలని ఆదేశించింది.