- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనా అనుమానితుడు ఐసోలేషన్‌కు తరలింపు

దిశ, మెదక్: కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధి చేర్యాల మండలం వేచరేణిలో.. కరోనా అనుమానిత వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలించారు. కాగా, అతడు ఇటీవల ఢిల్లీలోని నిజామొద్దీన్ మర్కజ్ ప్రార్థన మందిర సమావేశానికి హాజరైనట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి 15 తేది వరకు ఢిల్లీలో జరిగిన సదస్సుకు వేచరేణికి చెందిన జమీన్ పాషా హాజరయ్యాడు. ఆ తర్వాత 18వ తేదిన రైలులో హైదరాబాద్‌కు తిరిగివచ్చి.. గోల్కొండ బేతిగల్ ప్రాంతంలో ఐదు రోజులు ఉన్నాడు. ఈ నెల 25న తన సొంత కారులో వేచరేణికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న అధికారులు మంగళవారం నాడు జమీన్ పాషాను మిట్టపల్లిలోని సురభి మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌కు తరలించారు. అలాగే జమీన్ పాషా కుటుంబ సభ్యులు, స్నేహితులను 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ పాటించాలని అధికారులు సూచించారు.
Tags: Corona suspect, move, isolation, komuravelli, medak