కరోనా సెకండ్ వేవ్‌లో బి.1.617.2 వేరియంట్

by Shyam |
Dr. Rakesh Mishra
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందేందుకు బి.1.617.2 అకా డెల్టా వేరియంట్ కారణమని సీసీఎంబీ ప్రకటించింది. ఈ వేరియంట్లను వారణాసి పరిసర ప్రాంతాల్లో గుర్తించామని తెలిపారు. శుక్రవారం సీసీఎంబీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో డెల్టావేరియంట్లపై బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నిర్వహించిన అధ్యయానాల గుర్తించిన వివరించారు.

ఏప్రిల్ నెలలో వారణాసి పరిసర ప్రాంతాల్లో మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ 130 శాంపిళ్లను సేకరించి అధ్యాయనాలు చేపట్టిందని తెలిపారు. ఈ పరిశోధనల్లో ప్రధానంగా 7 రకాల మేజర్ స్ట్రేయిన్ వైరస్ వేరియంట్లు వారణాసి ప్రాంతాల్లో ఉన్నాయని గుర్తించమని ప్రకటించారు. వీటిలో ప్రధానమైన బి.1.617 వేరియంట్ వైరస్‌ లో భాగమైన బి.1.617.2 ఆకా డెల్టా వేరియంట్ వైరస్ లు సెకండ్ వేవ్ వ్యాప్తికి కారణమయ్యయని మల్టీడిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ హెడ్ ప్రొఫెసర్ సింగ్ వివరించారు. సేకరించిన శాంపిళ్లలో 36శాతం శాంపిళ్లలో ఆకా డెల్టా వేరియంట్లు ఉన్నట్టుగా తెలిపారు. వీటితో పాటు సౌత్ ఆఫ్రికాలో మొదటి సారిగా గుర్తించినబడిన బి.1.351 వైరస్ వేరియంట్ ను కూడా తమ పరిశోధనల్లో గుర్తించామని సీసీఎంబీ అడ్వైసర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు.

ఆకా డెల్టా వేరియంట్ కారణంగానే కరోనా సెకండ్ వేవ్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని వివరించారు. వీటితో పాటు ఇతర వైరస్ లను కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టడం కూడా ఎంతో అవసరమని భావించారు.

Advertisement

Next Story

Most Viewed