రేపు కరోనాపై ప్రధాని మోడీ సమీక్ష..

by vinod kumar |   ( Updated:2021-06-09 00:57:59.0  )
Prime Minister Modi to attend G7 summit
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుండటంపై గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించనున్నారు. కేంద్రహోంమంత్రి అమిత్ షా, హోంశాఖ అధికారులు ప్రధాని అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితితో పాటు వ్యాక్సినేషన్ ఉత్పత్తి పెంపు, రాష్ట్రాలకు వ్యాక్సినేషన్ సరఫరా, థర్డ్ వేవ్‌ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమీక్షలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 18ఏళ్ల పైబడిన వారికి టీకా ఇస్తామని చెప్పి తగినంత నిల్వలు లేకపోవడంతో ఆపివేసిన విషయం తెలిసిందే. ఇటువంటి వరిస్థితి మరొకసారి రాకుండా ఉండేందుకు పకడ్భందీగా చర్యలు చేపట్టేందుకు కరోనాపై సమీక్షలో మోడీ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed