కరోనా వార్తలతో మానసిక ఒత్తిడి

by  |
కరోనా వార్తలతో మానసిక ఒత్తిడి
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19కి సంబంధించి ప్రతి చిన్న అప్‌డేట్ కోసం వార్తా ఛానళ్లకు అతుక్కుపోతున్నారా? అయితే మీ మానసిక ఆరోగ్యం జాగ్రత్త.. అవును, కరోనాకు సంబంధించి ఎక్కువగా నెగెటివ్ వార్తలు చూడటం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్), క్లాస్ట్రోఫోబియా (ఇరుకైన ప్రదేశాల్లో ఉంటే కలిగే భయం) ఉన్నవారి మీద ఈ నెగెటివ్ వార్తల ప్రభావం ఉంటుందని ప్రముఖ మానసిక నిపుణుడు డాక్టర్ సమీర్ మల్హోత్రా అన్నారు.

కొన్నిసార్లు ఈ మానసిక ఒత్తిడి కారణంగా సదరు వ్యక్తులు తీవ్ర ప్రవర్తనా లక్షణాలు చూపించే అవకాశం ఉందని మల్హోత్రా చెప్పారు. దీని నుంచి బయటపడటానికి వీలైనంత వరకు వార్తాఛానళ్లను వీక్షించకుండా ఉండాలని, వాటికి బదులుగా సినిమాలు చూడటం లేదా మరేదైనా ఇతర వ్యాపకాలను అలవాటు చేసుకోవాలని డాక్టర్ మల్హోత్రా సలహా ఇస్తున్నారు. ఇప్పటికే ఓసీడీ గురించి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నవారు ఇలాంటి సమయాల్లో వారి ట్రీట్‌మెంట్ తప్పనిసరిగా కొనసాగించాలని, డాక్టర్లను కచ్చితంగా ఫోన్ ద్వారా సంప్రదించాలని మల్హోత్రా చెప్పారు.

Tags : CORONA, OCD, covid 19, Claustrophobia, Mental disorder, mental stress


Next Story