కేంద్రం కీలక ప్రకటన.. పది రాష్ట్రాల్లోనే కరోనా విజృంభన

by Shamantha N |
కేంద్రం కీలక ప్రకటన.. పది రాష్ట్రాల్లోనే కరోనా విజృంభన
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్తగా నమోదైన కేసుల్లో 72.19 శాతం.. మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తర్​ప్రదేశ్, కేరళ, కర్ణాటక, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ల్లోనే నమోదవుతున్నట్లు కేంద్రం పేర్కొంది. మరణాల విషయంలో మహారాష్ట్ర (ఒక్కరోజులో (920)) మొదటి స్థానంలో ఉంది.

ఆంధ్రప్రదేశ్​మినహా మిగతా తొమ్మిది రాష్ట్రాల్లో మరణాల సంఖ్య కూడా ఎక్కువ నమోదవుతోందని కేంద్రం తెలిపింది. ఇక దేశంలో ఈరోజు కొత్తగా 4,12,262 కేసులు నమోదు కాగా 3,980 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 57,640 కేసులు నమోదయ్యాయి.

Advertisement

Next Story