నాకు కూడా కరోనా వచ్చింది

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ క్రీడాకారుడు నొవాక్ జొకోవిచ్ కోచ్ గోరన్ ఇవానిసెవిక్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని తానే తెలిపినట్లు సమాచారం. రెండుసార్లు కరోనా టెస్టులు చేయించుకుంటే నెగెటివ్ వచ్చిందని, మరోసారి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు. అయితే జొకోవిచ్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే. జొకోవిచ్ తోపాటు ఈయన ఆడ్రియా టోర్నీకి హాజరయ్యాడు. ఈ ఈవెంట్లో పాల్గొన్నవారికి కరోనా సోకిందన్న విషయం తెలుసుకున్న అతను కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.

Advertisement