ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు

by srinivas |   ( Updated:2021-02-01 06:38:40.0  )
ఏపీలో కొత్తగా 64 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 21,922మందికి పరీక్షలు నిర్వహించగా 64మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,87,900కు చేరింది. ఒక్కరు చనిపోవడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,154గా ఉంది. ప్రస్తుతం 1,242 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,89,504మంది డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 99మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,31,59,794మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అనంతపురం జిల్లాలో 4 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా చిత్తూరులో 4, తూర్పుగోదావరి జిల్లాలో 15, గుంటూరులో 7, కడపలో 4, కృష్ణా జిల్లాలో 9, కర్నూలులో 2, నెల్లూరులో 8, శ్రీకాకుళంలో 1, విశాఖపట్నంలో 10 కేసులు వచ్చాయి. ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో ఒకరు చనిపోయినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Advertisement

Next Story