ఏపీలో కొత్తగా 1,395 కరోనా కేసులు

by srinivas |   ( Updated:2020-11-17 07:09:41.0  )
ఏపీలో కొత్తగా 1,395 కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24గంటల్లో 66,778మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,395 కొత్త కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,56,159కి చేరింది. 9మరణాలు సంభవించడంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,890గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 16,985ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 8,32,284 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 2,293మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 92.64లక్షల మందికి కరోనా శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా కృష్ణా జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు, కడపలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 137, తూర్పుగోదావరిలో 214, గుంటూరులో 199, కడపలో 52, కృష్ణా జిల్లాలో 260, కర్నూలులో 18, నెల్లూరులో 32, ప్రకాశంలో 31, శ్రీకాకుళంలో 37, విశాఖపట్నంలో 75, విజయనగరంలో 35, పశ్చిమగోదావరిలో 247 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed