ఏపీలో తగ్గిన కరోనా కేసులు

by srinivas |
ఏపీలో తగ్గిన కరోనా కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులో తగ్గాయి. గడిచిన 24గంటల్లో 61,330మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,918 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,86,050కు చేరింది. 24మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,453గా ఉంది. ప్రస్తుతం 35,065 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 7లక్షల 44వేల 532మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఒక్కరోజులో 4,303మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 71లక్షల 27వేల 533 మందికి శాంపిల్స్ పరీక్షించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి చిత్తూరు జిల్లాలో నలుగురు ప్రాణాలు కోల్పోగా గుంటూరులో నలుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, కడపలో ముగ్గురు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, నెల్లూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు.

అనంతపురం జిల్లాలో 218 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా చిత్తూరులో 380, తూర్పుగోదావరి జిల్లాలో 468, గుంటూరులో 333, కడపలో 155, కృష్ణాలో 117, కర్నూలులో 66, నెల్లూరులో 119, ప్రకాశంలో 308, శ్రీకాకుళంలో 143, విశాఖపట్నంలో 120, విజయనగరంలో 44, పశ్చిమగోదావరి జిల్లాలో 447 కేసులు వచ్చినట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed