- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో కరోనా @ 603
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనాను కట్టడి చేయడంలో విఫలమవుతోంది. వలంటీర్ల సర్వేలు, క్వారంటైన్‌లు, ఐసోలేషన్‌లు కూడా కరోనా వైరస్ విస్తరణను అడ్డుకోలేకపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ తలలు పట్టుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ఏపీలో గత 24 గంటల్లో జరిగిన కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల్లో 31 కేసులు నమోదైనట్టు ప్రకటించింది. దీంతో ఏపీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 572 నుంచి 603కి చేరుకుందని తెలిపింది. కరోనా కారణంగా 546 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపింది. 42 మంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ నయమై ఇళ్లకు చేరినట్టు ప్రకటించింది. వైజాగ్, కడప జిల్లాల నుంచి 13 మంది చొప్పున డిశ్చార్జ్ అయినట్టు వెల్లడించింది.
దీంతో వైజాగ్‌లో చికిత్స పొందుతున్న కేసులు కేవలం ఏడేనని వెల్లడించింది. గడచిన 24 గంటల్లో అత్యధిక కేసులు కృష్ణా జిల్లా నుంచి అత్యధికంగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఆ తరువాత కర్నూలు జిల్లా నుంచి ఐదు కేసులు నమోదయ్యాయని చెప్పారు. నెల్లూరు జిల్లా నుంచి మూడు కేసులు, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లా నుంచి చెరి రెండు కేసుల చొప్పున పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరికి కరోనా సోకిందని ప్రకటించింది.
అదే సమయంలో కరోనా కారణంగా 15 మంది మృతి చెందారని, వారిలో అత్యధికంగా కృష్ణా జిల్లా (5) నుంచేనని తెలిపింది. ఏపీలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 129 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు చెప్పారు. ఆ తరువాత గుంటూరు 126, కృష్ణా 70, నెల్లూరు 67, ప్రకాశం 44, కడప 37, పశ్చిమగోదావరి 35, చిత్తూరు 30, అనంతపురం 26, వైజాగ్ 20, తూర్పుగోదావరి 17 చొప్పున కేసులు నమోదయ్యాయి.
Tags: corona virus, covid-19, arogyaandhra, twitter, health department