- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో ఐదువేలు దాటిన కరోనా.. కొత్తగా 219 కేసులు
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఐదు వేలు దాటింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 219 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలోనే 204 మంది ఉన్నారు. హైదరాబాద్‌లో 189, రంగారెడ్డిలో 13, మేడ్చల్‌లో ఇద్దరు చొప్పున ఉన్నారు. హైదరాబాద్ నగరంలో కరోనా కట్టడి కోసం కంటైన్‌మెంట్ జోన్ల లాంటి ఎన్ని చర్యలు తీసుకున్నా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా ఇద్దరు కరోనా కారణంగా మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,193కు, మొత్తం మృతుల సంఖ్య 187కు చేరుకుంది. సోమవారం నమోదైన 219 కేసుల్లో జీహెచ్ఎంసీలో 189, రంగారెడ్డిలో 13, వరంగల్ అర్బన్‌లో నాలుగు, వరంగల్ రూరల్‌లో మూడు, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో రెండు, రెండు చొప్పున, వనపర్తి, పెద్దపెల్లి, మెదక్, ఆదిలాబాద్, యాదాద్రి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. మంగళవారం నుంచి మరింత ఎక్కువ సంఖ్యలో కరోనా నిర్ధారణ టెస్టులు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందున హైదరాబాద్ నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. వైద్యారోగ్య శాఖ కూడా నగరంలో ఊహించనంత ఎక్కువగా పెరుగుతాయని అభిప్రాయపడుతోంది.