వరంగల్ అర్భన్‌లో మరో కరోనా కేసు

by Shyam |   ( Updated:2020-04-12 07:49:10.0  )

దిశ, వరంగల్: వరంగల్ అర్భన్ జిల్లాలో మరొకరికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ లలితా దేవి అధికారికంగా వెల్లడించారు. గత నెలలో ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వ్యక్తికి కరోనా వైరస్ సోకగా అతడితో సన్నిహితంగా ఉన్న వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. ఆదివారం రిపోర్టు రాగా అతడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్టు తేలింది. దీంతో బాధితుడిని తదుపరి వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు ఆమె‌ వివరించారు.

tags ; corona, lockdown, positive cases, health officer lalitha devi, markaz

Next Story

Most Viewed