నవనీత్ కౌర్ ఇంట కరోనా కలకలం

దిశ, వెబ్‌డెస్క్: అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ఇంట్లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. తన మామా రవి గంగాధర్ రానాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నవనీత్, ఆమె భర్తకూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. సుమారు 60 సభ్యులు, కార్యకర్తలకు కూడా కరోనా టెస్టులు చేయించారు. అయితే, వైద్యారోగ్య శాఖ అధికారులు ఎమ్మెల్యే రానా ఇంటి ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. కాగా, నవనీత్, ఆమె భర్తకు తప్పుగా కరోనా శాంపిల్స్ సేకరించారని రవి రానా ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖకు రవి రానా ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

Advertisement