చీకట్లో కరోనా రోగులు.. మిన్నంటిన ఆర్తనాదాలు!

by srinivas |
tenali hospital
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు క్రమేపి పెరుగుతుండటం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. కేసుల నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆశించినంత ఫలితాలను ఇవ్వడం లేదు. గతంలో నమోదైన కేసుల స్థాయికి ప్రస్తుతం ఏపీ చేరుకుంది. కేసులు క్రమంగా పెరగడం ఒక సమస్య అయితే, వారికి ఆక్సిజన్, వ్యాక్సినేషన్ అందించడంలో ఏపీ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ అందుబాటులో లేక కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తాజాగా గతరాత్రి కురిసిన వర్షాలకు గుంటూరు జిల్లా తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న రోగులు ఆక్సిజన్ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణవాయువు కోసం వారి ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. సుమారు గంట నుంచి పవర్ లేకపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని అటు వైద్యులు, ఇటు రోగుల తరఫు బంధువులు ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed