డంపింగ్ వాహనంలో కరోనా బాధితులు

దిశ, వెబ్ డెస్క్ :
ఏపీలోని విజయనగరం జిల్లాలో అమానుష ఘటన జరిగింది. కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురు వ్యక్తులను స్థానిక వైద్య సిబ్బంది చెత్త తరలించే వాహనంలో తీసుకెళ్ళారు.ఈ ఘటన జిల్లాలోని నెల్లిమర్ల మండలం జరజాపుపేటలోని బీసీ కాలనీలో ఆదివారం వెలుగుచూసింది.

విషయం తెలుసుకున్న స్థానికులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా బాధితులు అనే మానవత్వం లేకుండా వారి పట్ల అమానుషంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement