- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా కంటే ఇదే ఎక్కువ భయపెడుతుంది.. కాపాడండి
దిశ, వెబ్ డెస్క్ : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎంతో మంది ధైర్యాన్ని కోల్పోతున్నారు. తాము బతుకుతాము అనే ఆలోచన కూడ వారిలో లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నో వీడియోలు వస్తునే ఉన్నాయి. కొన్ని కొన్ని వీడియోలు మనసును కలిచి వేస్తున్నాయి. కానీ ఒక్క వీడియో మాత్రం నవ్వు తెప్పిస్తుంది. కరోనాకి సంబంధించిన వీడియో నవ్వించడం ఏంటీ అనుకుంటున్నారు కదా.. కరోనా సోకిన వ్యక్తి ఓ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. అతను ఒక పోస్ట్ చేశాడు నేను కరోనాకి భయపడటం లేదు నా బెడ్ పై ఉన్న ఫ్యాన్ ఎప్పుడు ఊడి నామీద పడుతుందోనని భయంగా ఉందని పోస్ట్ చేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలోని ఓ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఈ వీడియో చూస్తే కొంత బాధగా అనిపించిన కొందరిని నవ్విస్తున్నది. మెయింటెనెన్స్ సరిగా లేక సీలింగ్ కి ఉన్న ఫ్యాన్ గుండ్రంగా తిరుగుతుంది. ఆ ఫ్యాన్ కింద ఉన్న వ్యక్తి ఫ్యాన్ తిరిగే దృశ్యాలను తన ఫోన్ లో బందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కరోనా కంటే ఈ ఫ్యాన్ తమను భయపెడుతుందని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ విషయం పై అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Corona se darr nahi lagta sahab is fan se dar lag raha hai.. covid 19 positive patient in hospital
Watsapp post… pic.twitter.com/SswxNT4B9J— Ibrahim (@CMibrahim_IN) April 26, 2021