అడ్మిట్ చేసుకోలేదు ప్రాణం పోయింది

by  |
అడ్మిట్ చేసుకోలేదు ప్రాణం పోయింది
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా పేషంట్ల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. ఆస్పత్రుల తీరుపై ఇప్పటికే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం, ఆస్పత్రి సిబ్బంది ఆలసత్వంతో కరోనా బాధితుల అవస్థలు వీడియో రూపంలో బయటకువస్తోన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే తిరుపతిలో మరో అమానుష ఘటన వెలుగుచూసింది.

తిరుపతిలోని ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలడంతో హోంఐసోలేషన్‌లోనే ఉంటున్నాడు. అయితే, ఒక్కసారిగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో కుటుంబీకులు అంబులెన్స్‌కి సమాచారం అందించారు. కాగా, అంబులెన్స్‌లోనే బాధితుడితో కుటుంబీకులు ఎన్నో కొవిడ్ ఆస్పత్రులు తిరిగినా వెంటిలేటర్ ఖాళీగా లేదని అడ్మిట్ చేసుకోలేమని చెప్పారు.

ప్రైవేట్ ఆస్పత్రులకు వెళితే. వెంటిలేటర్లు ఖాళీ లేకపోవడంతో పాటు లక్షలు డిమాండ్ చేయడంతో వెనక్కి వచ్చారు. చివరకు రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి వెంటిలేటర్ అమర్చేలోపు బాధితుడు మృతి చెందాడు. అయితే, తన భర్త మృతికి కొవిడ్ ఆస్పత్రుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి భార్య ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed