- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కరోనా నెగెటివ్..కారణం శ్రీరాముడు, గోమాతే

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఇటీవల అతని గన్ మెన్‌కు పాజిటివ్ రావడంతో ఆందోళనకు గురైన ఆయన ఫ్యామిలీతో సహా హోం క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కుటుంబంతో పాటు తాను టెస్టులు చేయించుకున్నారు. సోమవారం వచ్చిన రిపోర్టుల్లో తనకు, కుటుంబసభ్యులకు నెగిటివ్ వచ్చింది. అయితే శ్రీ రాముడు, గోమాత దయవల్ల తనకు, కుటుంబంలో ఎవరికీ వైరస్ సోకలేదనే విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఇటీవల ఎమ్మెల్యే గన్‌మెన్‌కు కరోనా వైరస్ వచ్చిందని తెలియడంతో ఆయన్ను కలిసిన వారంతా కూడా ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై ఆరా తీశారు. చివరగా టెస్టుల్లో నెగిటివ్ రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
https://twitter.com/TigerRajaSingh/status/1274958157777735680?s=20