కాలం, కరోనా ఆడుకున్నాయి.. చిరుకు నెగెటివ్

by Anukaran |   ( Updated:2020-11-12 10:55:51.0  )
కాలం, కరోనా ఆడుకున్నాయి.. చిరుకు నెగెటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తాజాగా కరోనా నెగెటివ్ వచ్చింది. ఆయనకు కరోనా పాజిటివ్ వ్యవహారం ఇండస్ట్రీ, రాజకీయాల్లో దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆయన సరిగ్గా మూడు రోజుల ముందు సీఎం కేసీఆర్ తదితరులను కలవడంతో సీఎంఓలో కలవరం మొదలైంది. కానీ, తాజాగా చిరుకు నెగెటివ్ వచ్చినట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. మరోసారి ప్రయత్నంగా మూడు సార్లు కరోనా టెస్టులు చేయించుకుంటే నెగిటెవ్ వచ్చిందని చిరు చెప్పాడు.

‘కాలం, కరోనా గత నాలుగు రోజులుగా నన్ను కన్ఫ్యూస్ చేసి, నాతో ఆడేసుకున్నాయి. ఆదివారం టెస్ట్‌లో పాజిటివ్ రిపోర్ట్ అన్న తరువాత బేసిక్ మేడికేషన్ స్టార్ట్ చేశాను. రెండు రోజులైన ఎటువంటి లక్షణాలు లేకపోయేసరికి, నాకే అనుమానం వచ్చి అపోలో డాక్టర్స్‌ని అప్రోచ్ అయ్యాను. వాళ్లు కూడా అక్కడ సీటీ స్కాన్ తీసి చెస్ట్‌లో ఎలాంటి ట్రేసెస్ లేవు అన్న నిర్ధారణకు వచ్చారు. అక్కడ రిజల్ట్ నెగెటివ్ వచ్చాక, మరోక్కసారి, మరోచోట నివృత్తి చేసుకుందామని నేను Tenet Labలో 3 రకాల కిట్స్‌లతో టెస్ట్ చేయించాను. అక్కడా నెగెటివ్ వచ్చింది. ఫైనల్‌గా ఆదివారం నాకు పాజిటివ్ అని రిపోర్ట్ ఇచ్చిన చోట కూడా RT PCR టెస్ట్ చేయించాను. అక్కడ కూడా నెగెటివ్ వచ్చింది. ఈ మూడు రిపోర్టుల తర్వాత మొదటి రిపోర్ట్ ఫాల్ట్ కిట్ వలన వచ్చిందని డాక్టర్‌ నిర్ధారణకి వచ్చారు. ఈ సమయంలో మీరందరు చూపించిన కన్‌సెర్న్, ప్రేమాభిమానాలకి, చేసిన పూజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’.. అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు చిరంజీవి.

Advertisement

Next Story