‘మాస్క్ ధరించకుంటే ఆస్పత్రిలో పనిచేయాలి’

by Shamantha N |   ( Updated:2020-07-06 07:57:30.0  )
‘మాస్క్ ధరించకుంటే ఆస్పత్రిలో పనిచేయాలి’
X

భోపాల్: మాస్కులు ధరించకుండా, కరోనా నిబంధనలు ఉల్లంఘించినవారితో కరోనా వారియర్స్ పనులు చేయించాలని ఓ జిల్లా కలెక్టర్ భావించారు. అనుకున్నదే తడవుగా ఈ ఉల్లం‘ఘనులు’ కనీసం మూడు రోజులు ఆస్పత్రిలో లేదా చెక్‌పోస్టుల్లో వాలంటీర్‌గా పనిచేయాలని, అదే వారికి శిక్ష అని గ్వాలియర్ జిల్లా కలెక్టర్ కౌశలేంద్ర విక్రమ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. కిల్ కరోనా క్యాంపెయిన్ కోసం అధికారులతో సమావేశమయ్యాక ఆయన ఈ ఆదేశాలనిచ్చారు. సోమవారం నుంచే ఈ ఆదేశాలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. కిల్ కరోనా క్యాంపెయిన్ కింద వైద్య నిపుణులు, అధికారులు 15 రోజులపాటు ఇంటింటికి తిరిగి కరోనా పేషెంట్లను గుర్తించి, ఐసొలేట్ చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed