కళ్లకు భారం కలిగిస్తున్న కరోనా

by  |
కళ్లకు భారం కలిగిస్తున్న కరోనా
X

కరోనా పాజిటివ్ వచ్చిన వారి కళ్ల మీద వైరస్ ఏమైనా ప్రభావం చూపిస్తోందో లేదో తెలియదు కానీ ఈ వైరస్ కారణంగా ఏర్పరుచుకున్న కొత్త అలవాట్లు మాత్రం కళ్లను ఇబ్బంది పెడుతున్నాయి. ఒకప్పుడు వివిధ రకాల పనుల్లో నిమగ్నమై కంప్యూటర్ ముందు పనిచేసే వారికి మినహా మిగతా వాళ్లందరికీ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండేది. కానీ లాక్‌డౌన్ సమయంలో చాలామంది స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ స్క్రీన్‌ల ముందు గేమ్స్ ఆడుతూ, పని చేసుకుంటూ, సిరీస్‌లు చూసుకుంటూ కాలం వెళ్లదీశారు. మార్చి నుంచి స్ట్రీమింగ్ సర్వీసుల ఉపయోగం 30 శాతం పెరిగిందంటేనే పరిస్థితి ఎంతలా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఓవైపు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నవాళ్లు ఎలాగూ కంప్యూటర్ స్క్రీన్ ముందు కాలం గడిపేస్తున్నారు. మరోవైపు ఏం పని లేకుండా ఖాళీగా ఉన్నవాళ్లకు ఫోన్, టీవీ తప్ప వేరే కాలక్షేపం లేకుండా పోయింది. చివరకు పుస్తకం చదవాలన్నా కూడా ఫోన్, ట్యాబ్లెట్ ఉపయోగిస్తున్నారు. దీంతో కళ్ల మీద తీవ్రంగా ఒత్తిడి పడుతోంది. ఇప్పటికే చాలా మంది బ్లూలైట్ విజన్, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ సమస్యలతో తమ దగ్గరికి వస్తున్నట్లు ఆప్తాల్మాజిస్ట్‌లు చెబుతున్నారు. అంతేకాకుండా స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడానికి అందరూ ప్రయత్నిస్తున్నప్పటికీ వాళ్ల వల్ల కావడం లేదని కొంతమంది సైకాలజిస్టుల దగ్గరకి కూడా వెళ్తున్నారట. కాబట్టి స్క్రీన్ టైమ్ తగ్గించకుండా వెలుతురు వల్ల కళ్ల మీద ప్రభావం చూపించకుండా ఉండే జాగ్రత్తలు చెప్పి సైకాలజిస్టులు వెనక్కి పంపిస్తున్నారు. మీరు కూడా ఎక్కువగా ఫోన్ ఉపయోగిస్తే దానికి ఎల్‌ఈడీ లైట్‌ను ఫిల్టర్ చేయగల స్క్రీన్ గార్డ్ వేయించుకోవడం, కంప్యూటర్ ముందు పనిచేస్తుంటే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుని కళ్లకు విశ్రాంతి కల్పించడం వంటివి పాటించాలి.



Next Story