జైలులో కరోనా కలకలం

by srinivas |
జైలులో కరోనా కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. అది ఎవ్వరినీ కూడా వదలడంలేదు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సబ్ జైలు వరకు వెళ్లింది కరోనా వైరస్. జైలులోని విధులు నిర్వర్తిస్తున్న నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు ఖైదీలు కరోనా కోరలకు చిక్కారు. టెస్టులు చేయగా వారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఒక్కసారిగా జైలులో కలకలం రేగింది. దీంతో అక్కడ మిగతా జైలు సిబ్బంది, ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్ తమకు ఎక్కడ సోకుతుందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అయితే, కరోనా సోకిన వీరికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story