టైఫాయిడ్ వస్తే కరోనా అనుకోని.. వారు ఏం చేశారంటే..?

by vinod kumar |   ( Updated:2021-05-14 23:01:50.0  )
టైఫాయిడ్ వస్తే కరోనా అనుకోని.. వారు ఏం చేశారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. కొంతమంది ఈ కరోనా కంటే దాని వలన వచ్చిన భయం వలనే చనిపోతున్నారు. మనో ధైర్యం లేక కరోనా వస్తే తమను చుట్టుపక్కలవారు అంటరానివారుగా చూస్తున్నారని భయపడి ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. తాజాగా టైఫాయిడ్ జ్వరం వస్తే కరోనా మహమ్మారి సోకిందని భయపడి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యకి పాల్పడ్డ విషాద ఘటన విజయనగరంలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే వేపాడ మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ గుప్తా , ఆయన రెండో భార్య సత్యవతి, అత్త వెంకటసుబ్బమ్మ తో కలిసి నివసిస్తున్నాడు. వారికి కుమారుడు సంతోష్ కుమార్తె పూర్ణ ఉన్నారు. అయితే గతకొద్ది రోజుల క్రితం గుప్తాకు జ్వరం వచ్చింది. టెస్ట్ ల్లో అది టైఫాయిడ్ అని తేలింది. ఇంట్లోనే ఉండి మందులు వాడల్సిందిగా వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలోనే సత్యవతి కి కూడా జ్వరం వచ్చింది. వీరిని చూసుకోవడానికి చుక్కపల్లిలో ఉంటున్న కూతురు వచ్చింది. కాగా, గురువారం కుమార్తెను ఇంటికి వెళ్లిపొమ్మన్న గుప్తా.. శుక్రవారం భార్య, అత్తతో కలిసి స్వగ్రామం నల్లబిల్లి వచ్చాడు. తమకు ఖచ్చితంగా కరోనా నే సోకిందని నిశ్చయించుకున్న గుప్తా దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నల్లబిల్లి శివాలయం వెనక భాగంలోకి వెళ్లి వెంట తెచ్చుకున్న పురుగు మందును ఓఆర్ ఎస్ లో కలిపి తాగి, ఆ తర్వాత దగ్గర్లోనే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed