- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పుర పోరుకు కరోనా భయం.. భారమంతా ఎంఏయూడీదే
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పురపోరుకు నగరా మోగింది. మినీ పురపోరుకు కొవిడ్ భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథికి ఈ నెల 9న కరోనా పాజిటివ్‌గా తేలింది. క్వారంటైన్లో ఉన్నప్పటికీ… ఆన్లైన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్నికల నిర్వహణపై సమీక్షిస్తున్నారు. పార్థసారధితో పాటు ఎన్నికల సంఘం కార్యాలయంలో మొత్తం 13 మందికి పాజిటివ్ వచ్చింది. అరకొరగా సిబ్బంది ఉండగా… ఉన్న స్టాఫ్‌లో సగం మందికి కరోనా రావడంతో పుర ఎన్నికలకు సమయం తీసుకుంటారని భావించారు.
కానీ ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవడంతో ముందుకెళ్లారు. ప్రభుత్వం కూడా ఒక్కరోజులోనే రిజర్వేషన్లను ఖరారు చేసి జాబితా ఇచ్చింది. వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేసిన గంటకే ఎన్నికలపై నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఈ పుర సమరానికి మున్సిపల్ శాఖ డైరెక్టర్ ఎన్నికల అథారిటీ అధికారిగా ఉండటంతో సిబ్బందిని నియమించుకోవడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రత ఏర్పాట్లు, బ్యాలెట్ పత్రాల ముద్రణ వాళ్లే చూసుకుంటున్నారు. ఎస్ఈసీకి కరోనా భయం ఉండటంతో… ఎన్నికల నిర్వహణ బాధ్యత పురపాలిక శాఖపై ఎక్కువగా ఉంటోంది.