కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా

by Shamantha N |   ( Updated:2020-03-24 02:10:40.0  )
కరోనా ఎఫెక్ట్: రాజ్యసభ ఎన్నికలు వాయిదా
X

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గురువారం జరగాల్సిన రాజ్యసభ ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. మార్చి 31న పరిస్థితిని సమీక్షించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకోనున్నది. ‘ప్రస్తుతం దేశంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఉంది. జనం పెద్ద ఎత్తున ఎక్కడా గుమిగూడకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. రాజ్యసభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా పోలింగ్, ఇతర అధికారులు, రాజకీయ పార్టీలు ఏజెంట్లు, ఎమ్మెల్యేలు ఒక్క దగ్గరికి వస్తారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రాజ్యసభ ఎన్నికలను నిర్వహించం మంచిది కాదు’ అని భావిస్తున్నట్లు సీఈసీ వర్గాలు తెలిపాయి. మొత్తం 55 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తి కావడంతో ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. బుధవారం విత్‌ డ్రాల సమయం ముగిసే సమయానికి ఎలాంటి నామినేషన్లు దాఖలు కాకపోవడంతో 37 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుజారాత్‌, ఆంధ్రప్రదేశ్‌ల్లో నాలుగు, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ల్లో మూడు, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒకటి చొప్పున రాజ్యసభ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగాల్సి ఉంది.

Tags: rajya-sabha-elections-scheduled-for-march-26-deferred-over-coronavirus-election-commission-to-review

Advertisement

Next Story