ప్రస్తుతం ఆ సేవలు నిలిపివేత

by  |
ప్రస్తుతం ఆ సేవలు నిలిపివేత
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కరోనా ఎఫెక్ట్ ప్రభత్వ రంగాలపై కూడా పడింది. 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన వారిని గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ స్మైల్ ముస్కాన్’ కరోనా కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. కరోనా మహమ్మారి కారణంగా తప్పిపోయిన పిల్లలను వెతికి పట్టుకొచ్చి చైల్డ్ కేర్ సెంటర్‌లో క్వారంటైన్ చేసే పరిస్థితి లేకపోవడంతో సాధ్యం కాదని అధికారులు చెప్తున్నారు. ఒకవేళ ఎవరికైనా కరోనా ఉంటే ఈజీగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ఆఫీసర్లు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అనాథలు, వీధి బాలలు, భిక్షాటన చేసే వారికి షెల్టర్ ఇచ్చే చైల్డ్ కేర్ సెంటర్‌ల కొరత మరో కారణం కాగా.. ప్రభుత్వం శాశ్వత భవనాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతుండం కూడా కారణంగా చెప్పొచ్చు.

బాలికలే ఎక్కువ..

కొవిడ్ మహమ్మారి కారణంగా చైల్డ్ కేర్ కేంద్రాల్లో బాలికలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నిజామాబాద్ కేంద్రంలో 120 మంది చిన్నారులు ఉన్నారు. బాలల కేంద్రాల కోసం స్థలం కేటాయింపు పూర్తికాకపోవడంతో ఈ సారి సీజన్‌లో రిస్క్ ఆపరేషన్‌లు చేయొద్దని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏటా జనవరి, జూలై మాసాల్లో ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ కార్యక్రమాలను చేపడుతుంది. పోలీస్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, కార్మిక శాఖలు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నాలుగు శాఖలు నెలరోజుల పాటు వారికి కేటాయించిన నిర్ణీత ప్రాంతంలో నెలరోజుల పాటు తప్పిపోయిన చిన్నారులను, బాలకార్మికులను, వీధి బాలలను, భిక్షాటన చేసే వారిని గుర్తించి వారిని తల్లిదండ్రులకు అప్పగించడం లేదా, చైల్డ్ కేర్ సేంటర్ లలో చెర్పిస్తుంటారు.

చైల్డ్ కేర్ సెంటర్‌కు..

తల్లిదండ్రుల నుంచి చిన్నారులు విడిపోవడం లేదా తప్పిపోవడం, బాల కార్మికులుగా, భిక్షాటన చేసే పిల్లలను ఆపరేషన్ ముస్కాన్ టీమ్ పట్టుకుని చైల్డ్ కేర్ సెంటర్‌‌కు పంపిస్తారు. తరుచూ చూస్తుంటాం. వీరిని కాపాడేందుకు కఠిన చట్టాలు ఉన్నా ఏటా వందల మంది ‘మిస్సింగ్’ అవుతూనే ఉన్నారు. అలాంటి వారిని రక్షించేందుకు 2014లో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ ఆనే కార్యక్రమాన్ని చేపట్టింది. చిన్నపిల్లలు అదృశ్యమైనా, బాల కార్మికులు, భిక్షాటన చేసే వారిని రక్షించడం ప్రధాన ఉద్దేశం. వైరస్ కారణంగా ఇతర ప్రాంతాల్లో ముఠాలు ఎత్తుకుపోయిన వారి కోసం, వారితో పని చేయించే వారి కోసం నిర్వహించే రిస్క్ ఆపరేషన్లను మాత్రం తాత్కాలికంగా నిలిపివేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 10 చైల్డ్ కేర్ సేంటర్ లు ఉన్నాయి.

తప్పిపోయిన వారి వివరాలు అప్‌డేట్..

కరోనా వైరస్ కారణంగా రిస్క్ ఆపరేషన్‌లను చేయకున్నా.. తప్పి పోయిన వారి వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్ మెంటల్ ధర్పణ్‌లో, మిస్సింగ్ చైల్డ్ పోర్టల్ వెబ్‌లో మాత్రం అదృశ్యమైన వారి వివరాలను ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేయనున్నారు. దానికి ఎన్‌జీ‌ఓల సహాయం తీసుకోనున్నారు. తప్పి పోయిన పిల్లలు ఎక్కడైనా ఉంటే వారి వివరాలను మిస్సింగ్ అయిన వారి వివరాలతో పోల్చుకుని వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చుతారు. ఆపరేషన్ స్మైల్ ముస్కాన్-6 కార్యక్రమంలో రిస్క్ ఆపరేషన్‌లు లేకుండా వీధి బాలలు, అనాథ బాలలు, భిక్షాటన చేసే వారిని తల్లిదండ్రులకు అప్పగించనున్నారు.


Next Story