- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుమంగళిపై కూడా కరోనా ఎఫెక్ట్
దిశ, కాటారం: శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ముత్తయిదువలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఈనెలలో ప్రతి శుక్రవారం నోము కోవడం, మంగళవారం గౌరీ వ్రతం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ముత్తయిదువులను ఇంటికి పిలిచి పసుపు, కుంకుమ ఇచ్చి పది కాలాల పాటు సుమంగళిగా ఉండాలని కోరుకుంటారు. దీర్ఘ సుమంగళిగా ఉండాలని పెద్ద వారి నుంచి ఆశీస్సులు కూడా తీసుకంటారు. కానీ, ఈసారి కరోనా మహమ్మారి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉన్నది. దాంతో పూజగదిలో గౌరీ దేవికే ఐదు సార్లు వాయినం ఇస్తున్నారు. 12 ఏండ్ల లోపు చిన్నారులు ఉంటే వారికి కూడా వాయినాలు ఇచ్చి సంతృప్తి పడుతున్నారు.
శ్రావణ శుక్రవారం..
ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున ముత్తయిదువులు వరలక్ష్మీ వ్రతాన్ని జరపుకుంటారు. మాంగళ్య బలం, అష్ట ఐశ్వర్యాలు, సంతానాభివృద్ధి జరగాలని మహిళలు ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని మహిళలు జరుపుకుంటారు. లక్ష్మీదేవి ప్రతిమతో పూజ గదిలో వ్రత కల్పాన్ని పటిస్తూ పూజలు చేస్తారు. ఆ రోజు కన్నెవడికిన దారాన్ని మూరెడు పొడవుతో తొమ్మిది వరుసలు పోస్తారు. దానికి పట్టు పోగు పెడతారు. వరలక్ష్మీ అమ్మవారి కథ వింటూ తొమ్మిది ముడులు వేస్తారు. దేవుడి మండపం తీసే సమయంలో తొమ్మది మూరల దండను కుడిచేతికి ధరిస్తారు. అంతేగాకుండా ప్రతి శుక్రవారం పసుపుతో గౌరీదేవిని తయారు చేసి కుంకుమ, గంధం వస్త్రంతో అలంకరించి మొలకలు వచ్చిన శనగలు, పెసలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం ఇరుగు పొరుగు ఇళ్లలోని ముత్తయిదువులకు వీటిని వాయినంగా ఇస్తారు. ఇలా చేయడం వల్ల నాతో పాటు మీరు కూడా సుమంగళిగా వర్దిల్లాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతారు. అయితే ఈసారి కరోనా కారణంగా ఇరుగు పొరుగు వాళ్లను కూడా కలిసే పరిస్థితి లేకపోవడంతో మహిళలు పూజగదికే పరిమితం అవుతున్నారు. పెద్దల ఆశీర్వాదాలు ఆన్ లైన్‌లో తీసుకోవాలని భావిస్తున్నారు.
ఇంట్లోనే పూజలు చేసుకుంటున్నం: లతా రెడ్డి, మహాముత్తారం
శ్రావణ మాసంలో జరిపే వ్రతాలకు ఏటా ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. గౌరీదేవిని ప్రత్యేకంగా అలంకరించి మూకుమ్మడిగా చేసుకోవాల్సిన వ్రతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా గుంపుగుంపులుగా చేరే పరిస్థితి లేకుండా పోయింది. ఈ సారి ఇంట్లోని పూజ గదికే వ్రతాలను పరిమితం చేయాల్సి వస్తోంది.