- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా మరణ మృదంగం.. ఒక్కరోజే 2 వేల మందికి పైగా మృతి
న్యూఢిల్లీ : భారత్‌పై కరోనా ఉగ్రరూపం చూపిస్తున్నది. మహమ్మారి దాటికి దేశంలో ఒక్కరోజే 2 వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. కేసులూ 3 లక్షలకు అత్యంత చేరువలో ఉన్నాయి. ఏడు రోజుల్లోనే కేసుల సంఖ్య 2 లక్షల నుంచి 3 లక్షలకు చేరువగా వచ్చిందంటే దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతిని అర్థం చేసుకోవచ్చు. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెలువరించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం నాటికి) దేశంలో 2,95,041 కేసులు నమోదుకాగా, వైరస్ బారిన పడి ఏకంగా 2,023 మంది మృత్యువాత పడ్డారు. దేశంలో కరోనా మరణాలు 2 వేలు దాటడం ఇదే తొలిసారి. దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండగా గతేడాది సెప్టెంబర్ 17న రికార్డైన అత్యధిక కేసులు (98,795) తో పోల్చితే బుధవారం నమోదైన కేసులు మూడు రెట్లు ఎక్కువ.
కొత్తగా నమోదైన కేసులతో కలిపి గత వారం రోజుల్లోనే దేశంలో 15 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకు కరోనా బారినపడినవారి సంఖ్య 1.56 కోట్లు (1,56,16,130) దాటగా.. లక్షా 82 వేల (1,82,553) మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 21,57,538 లక్షల కొవిడ్ యాక్టివ్ కేసులున్నాయి. దీంతో క్రియాశీల కరోనా కేసుల రేటు 13,26 శాతానికి పెరిగింది.
ఆ రాష్ట్రాల్లో మరింత తీవ్రంగా..
కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న ఐదు రాష్ట్రాలలో పాజిటివ్‌ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. మహారాష్ట్రలో మంగళవారం 62,097 కేసులు నమోదుకాగా.. యూపీ (29,574), ఢిల్లీ (28,395), కర్నాటక (21,794), కేరళ (19,577) లలోనూ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తర్వాతి స్థానాల్లో ఛత్తీస్‌గఢ్ (15,625), మధ్యప్రదేశ్ (12,727), గుజరాత్ (12,206) ఉన్నాయి.
మరణాలూ అక్కడే..
మరణాల విషయానికొస్తే.. మహారాష్ట్ర (519), ఢిల్లీ (277), యూపీ (162) లలో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి. కరోనా కేసులు, మరణాల ట్రెండ్‌ను చూస్తే ఇటీవలే లాన్సెట్ నివేదిక హెచ్చరించిన అంశాలు అది చెప్పిన టైం కంటే ముందే వాస్తవ రూపు దాల్చుతున్నాయి. ఆ నివేదిక ప్రకారం.. దేశంలో జూన్ నాటికి కరోనా రోజూవారీ మరణాలు 2,300 వరకు నమోదవుతాయని వెల్లడించగా, ఇంకా ఏప్రిల్ కూడా ముగియకముందే 2 వేల మార్కును క్రాస్ చేయడం ఆందోళనకు గురి చేస్తున్నది.