కాసేపట్లో ఖననం.. ఇంతలో తల్లి శవాన్ని చూసి షాక్

by vinod kumar |
Nizamabad Hospital
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ మృతదేహం తారుమారు అయ్యింది. వివరాళ్లోకి వెళితే.. నిజామాబాద్ నగరంలోని శివాజీ‌నగర్‌కు చెందిన గాలమణి(65) గతవారం రోజులుగా జీజీహెచ్‌లోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నది. పరిస్థితి విషమించి మంగళవారం తెల్లవారుజామున మృతిచెందింది. దీంతో మరణించిన మహిళ మృతదేహాన్ని ప్యాక్ చేసి పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఖననం చేసే సమయంలో కుటుంబసభ్యులు చివరిచూపు చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఖననం చేసేందుకు తీసుకొచ్చిన మృతదేహం తమ తల్లిది కాదని తెలియడంతో ఒక్కసారిగా కుటుంభసభ్యులందరూ కంగుతిన్నారు. తమ తల్లి మృతదేహం కోసం ఆరా తీయగా వర్ని మండలం జలాల్ పూర్ గ్రామానికి చెందిన గంగామణి మృతదేహం బదులు గాలమణి మృతదేహం అప్పగించడంతో వాళ్ళు దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు తెలియడంతో ఆవేదనకు గురయ్యారు. ఆస్పత్రిలోని కొవిడ్ విభాగం సిబ్బంది నిర్లక్ష్యంతో తమ తల్లి అంతక్రియలు చేసుకోలేకపోయామని లబోదిబోమని విలపించారు. తిరిగి గంగామణి మృతదేహం తీసుకువచ్చి ఆస్పత్రిలో అప్పగించారు.

రెండు నెలల్లో రెండో ఘటన..

నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలు తారుమారైన ఘటనలు కొవిడ్ సెకండ్ వేవ్‌లో రెండు నెలల్లో రెండుసార్లు జరిగాయి. గత రెండు నెలల క్రితం గాయత్రి నగర్‌కు చెందిన నర్సుబాయ్ కరోనాతో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేయడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వహించారు. నగరంలోని బర్కత్‌పూరకు చెందిన మైనారిటీ మహిళ మృతదేహాన్ని వారికి అప్పగించారు. దాంతో నర్సు బాయి కుటుంబీకులు మైనారిటీ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని గుర్తించిన మైనారిటీ కుటుంబ సభ్యులు ఆస్పత్రి నిర్వాహకులపై మండిపడ్డారు. తాజాగా మంగళవారం మరోసారి ఈ ఘటన పునరావృతం అయింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed