6 లక్షలు దాటిన కరోనా కేసులు

by Shyam |
6 లక్షలు దాటిన కరోనా కేసులు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. 28 వేలకు మించి ఈ వైరస్ కారణంగా మరణించారు. కరోనా మహమ్మారి చైనాలో కంటే యూరప్ దేశాల్లో, అమెరికాలో తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఈ వైరస్ వెలుగు చూసినప్పటినుంచి ఒక్కరోజులో అత్యధికంగా 919 మంది మరణించడం తొలిసారిగా ఇటలీలో చోటుచేసుకుంది. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. ఇదివరకు ఏ దేశంలోనూ కరోనా కేసులు లక్ష దాటలేదు. స్పెయిన్ లోని కరోనా విజృంభన అసాధారణంగా ఉంది.

అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. శనివారం సాయంత్రానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 6, 07,965కు పెరిగాయి. చైనా కంటే అధికంగా ఇటలీ, అమెరికాలో కరోనా కేసులు వెలుగుచూశాయి. అమెరికాలో 1,04,837, ఇటలీలో 86, 498, చైనాలో 81,996, స్పెయిన్ లో 65,719 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా 28,687 మంది కరోనాతో మృతి చెందారు. ఇటలీలో అత్యధికంగా 9,134 మంది చనిపోయారు. స్పెయిన్ లో 5,138 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి.

tags : Coronavirus, global, update, death toll, cases, covid 19

Advertisement

Next Story

Most Viewed