‘మెట్రో’తో పోటీపడుతున్న కరోనా..

by  |
‘మెట్రో’తో పోటీపడుతున్న కరోనా..
X

దిశ, న్యూస్ బ్యూరో: దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంగా గరిష్ట స్థాయిలో రోజువారీ కేసులు, కరోనా మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 97,399 కొత్త కేసులు నమోదుకాగా, 1,175 మంది కరోనా కారణంగా చనిపోయారు. తొలిసారిగా యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య తొమ్మిది లక్షల మార్కు దాటింది. మెట్రో రైలు సర్వీసులు మొదలైన తర్వాత గణనీయ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి.

టెస్టుల సంఖ్య పెరగడం కూడా ఇందుకు ఒక కారణం. కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 44.65 లక్షల పాజిటివ్ కేసులు నమోదుకాగా ఇందులో ఇంకా 9.19 లక్షల కేసులు యాక్టివ్ పాజిటివ్‌గా ఉన్నాయి. ఒక్క రోజు వ్యవధిలో 1,175 మంది కరోనాతో చనిపోవడంతో మృతుల సంఖ్య 75 వేలు దాటింది. జూలై చివరి వారం నాటికి యాక్టివ్ పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు లక్షలు ఉంటే కేవలం పదిహేను రోజుల వ్యవధిలో లక్ష పెరిగాయి. ఆ తర్వాత కేవలం పదకొండు రోజుల్లోనే మరో లక్ష యాక్టివ్ కేసులు పెరిగాయి.

తాజాగా ఎనిమిది రోజుల వ్యవధిలోనే మరో లక్ష యాక్టివ్ కేసులు పెరిగి ప్రస్తుతం తొమ్మిది లక్షల మార్కు దాటింది. మహారాష్ట్ర, ఢిల్లీ నగరాల్లో ఇటీవలి కాలం వరకూ కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించిన కొత్త కేసులు మళ్ళీ గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. ఢిల్లీ నగరంలో మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన తర్వాత కొత్త కేసులు నాలుగు వేలకు పైగా నమోదయ్యాయి. ముంబయి నగరంలో దాదాపు రెండున్నర వేల కొత్త కేసులు వచ్చాయి.


Next Story

Most Viewed