- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో బేఫికర్.. కొత్తగా 276 కేసులు
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం కరోనా పేరు చెబితే జనాలు కూడా లైట్ తీసుకుంటున్నారు. దానికి తోడు దేశంలో కరోనా టీకా అందుబాటులోకి రావడం, ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేయడంతో ఇన్నిరోజులు ఉన్న భయం కూడా పూర్తిగా తొలగిపోయినట్లు తెలుస్తోంది.
అదేవిధంగా కరోనా కేసులు కూడా తగ్గుముఖం పడుతుండటంతో జనాలు కూడా ఎవరిబిజీలో వారు మునిగిపోయారు. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఇవాళ కొత్తగా 276 కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,90,916కు చేరుకోగా, ఇప్పటివరకు 1,572 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4,495 యాక్టివ్ కేసులుండగా… 2,84,849 మంది చికిత్స అనంతరం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఇవాళ కొత్తగా 53 కేసులు నిర్ధారణ అయ్యాయి.