తెలంగాణలో కరోనా @1931

దిశ, వెబ్‌డెస్క్ :

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టేలా కనిపించడం లేదు. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. గడచిన 24గంటల్లో తెలంగాణలో 1,931 కరోనా కేసులు నమోదు కాగా, 11మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 298 కేసులు నిర్దారణ అయ్యాయి.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 86,475 చేరగా , వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 665కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 యాక్టివ్ కేసులుండగా, డిశ్చార్జయిన బాధితుల సంఖ్య 63,074కు చేరింది. కాగా, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 23,303 టెస్టులు నిర్వహించారు.

Advertisement