తమిళనాడు, కర్ణాటకలో కరోనా కలకలం

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో కరోనా వైరస్ క్రమేణా విజృంభిస్తోంది. రోజుకీ వేల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతూ మొత్తంగా లక్షల కేసులు రికార్డు అవుతున్నాయి. శనివారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసేటప్పటికీ.. తమిళనాడులో 5,879 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 99 మరణాలు వెలుగుచూశాయి. ఇప్పటివరకు ఇక్కడ మరణాల సంఖ్య 4,034గా ఉంది. తాజా కేసులతో తమిళనాడులో మొత్తం కేసుల 2,51,738కి చేరింది. కాగా, ఇప్పటి వరకు 1.90 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు.

అటు కర్ణాటకలోనూ కరోనా కొరలు చాస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 5,172 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. శనివారం బులెటిన్ విడుదల చేసేటప్పటికీ ఏకంగా 98 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. తాజా కేసులతో కర్ణాటకలో మొత్తం 1,29,287 మంది వైరస్ బారీన పడ్డారు. ఇప్పటివరకు మొత్తం 2,412 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 73,219 యాక్టివ్ కేసులున్నాయి.

Advertisement