పొంచి ఉన్న ముప్పు.. విజృంభిస్తోన్న కరోనా

by Anukaran |   ( Updated:2021-03-14 11:09:06.0  )
Corona virus
X

దిశ, వేములవాడ: వేములవాడలో ఈ నెల 11,12 తేదీల్లో జరిగిన మహా శివరాత్రి ఉత్సవాల్లో కరోనా కేసులు ప్రబలే ఆవకాశముందనే భయంతో అధికారులు ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు మూడు లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని ఆలయాధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ భౌతిక దూరం పాటించకపోవడంతో ఎక్కువగా ప్రబలే అవకాశం లేకపోలేదని వైద్య శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ జాతర ఉత్సవాలకు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్ ఉన్న వారు జాతరకు వస్తే, తొందరగా వ్యాప్తి చెందే అవకాశం లేకపోలేదు. జాతర ముగిసి రెండు రోజులు కావస్తుండగా, ఎవరికైనా దగ్గు, జ్వరం, తుమ్ములు లాంటి లక్షణాలుంటే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

మహారాష్ర్టలో లాక్‌డౌన్

వేములవాడలో ఏటా జరిగే మహా శివరాత్రి జాతరకు ఏటా అధిక సంఖ్యలో మహారాష్ర్ట నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ ఏడాది కూడా జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ రాష్ర్టంలో కొవిడ్–19 విజృభిస్తోంది. ఇప్పటికే ముంబయ్, పూణె లాంటి మహా నగరాల్లో అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు చేస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులకు మహారాష్ట్రతో అనుబంధం కలిగిఉంది. చేనేత పరిశ్రమకు కేంద్ర బిందువైన జిల్లాకు ప్రజలతో ముంబయ్. పూణె, భీవండి లాంటి ప్రాంతాలకు రాకపోకలు ఉన్నాయి. కరోనా కారణంగా దాదాపు 11 నెలలు ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు ఆగిపోయాయి. తర్వాత వ్యాపారాల నిమిత్తం తిరిగి రాకపోకలు ప్రారంభం అయ్యాయి. దీంతో కరోనా వైరస్ పెరిగే ఆవకాశం ఉంది. జాతరతో కూడా జిల్లాలో మరింతా కరోనా కేసులు పెరుగుతాయనే ఆందోళన మొదలైంది.

జిల్లాలో కరోనా కేసులు..

కరోనా మహమ్మారి తుడిచి పెట్టుకుపోతుందనే నమ్మకంతో ఉన్న ప్రజలకు మళ్లీ వణుకు పుట్టిస్తుంది. క్రమంగా కరోనా కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయం ప్రారంభమైంది. ఒక్క పక్కా కరోనా కట్టడికి టీకాల వేసుకుంటున్న కరోనా భయం మాత్రం ప్రజలను వీడడం లేదు. ఇప్పటి వరకు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు 1,210 ఉండగా, అందులో యాక్టివ్ కేసులు మాత్రం 128 ఉన్నాయి. కరోనా లక్షణాలు మాత్రం 2,275 మంది కలిగి ఉన్నారు. ఏదేమైనా జాతర ముగిసినప్పటికీ కరోనా పట్ల జాగ్రత్త ఉండడంతో పాటు లక్షణాలుంటే మాత్రం పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed