భారత్‌లో విజృంభిస్తున్న కరోనా…

దిశ వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 50,20,360 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 9,95,933 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 90,123 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 82,961 మంది డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఇప్పటి వరకు 39,42,360 డిశ్చార్జ్ కేసులు నమోదయ్యాయి. కాగా గడిచిన 24 గంటల్లో 1296 మంది కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 82,066కు చేరుకుంది.

Advertisement