మహారాష్ట్రలో కల్లోలం

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. దాని కోరలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. దాని ప్రభావంతో పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా నిన్న ఒక్కరోజే 9,601 కొత్త కేసులు నమోదయ్యాయి. 322 మంది మృత్యువాత పడ్డారు.

దీంతో ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా సోకిన వారి సంఖ్య 4,31,719కు చేరింది. ఇందులో 2,66,883 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల డిశ్చార్జ్ అయ్యారు. 1,49,214 మంది చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా మహారాష్ట్రలో ఇప్పటివరకు కరోనా సోకి 15,316 మంది మృతిచెందారు.

Advertisement