అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే..

by  |
అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే..
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విలయతాండం చేస్తోంది. గత కొన్నిరోజుల నుంచి ప్రతిరోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు దాని కోరలకు చిక్కి మృతిచెందుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో 22,725 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే ఐదు వందల కేసులు పెరిగాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య 7,42, 417 కు చేరుకుంది. ఇందులో 4,56,830 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2 లక్షల 64, 944 మంది బాధితులు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా గడిచిన 24 గంటల్లో కరోనాతో 482 మంది మృతిచెందారు. దీంతో మొత్తం దేశవ్యాప్తంగా కరోనా సోకి మృతిచెందిన వారి సంఖ్య 20,642 కు చేరింది. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియాలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.


Next Story