ఫిబ్రవరిలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి డీలా!

by Harish |
ఫిబ్రవరిలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి డీలా!
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక వృద్ధిని సూచించే పారిశ్రామిక ఉత్పత్తిలోని ప్రాధాన్యత కలిగిన ఎనిమిది కీలక రంగాల్లో ఉత్పత్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో 4.6 శాతం క్షీణించాయి. జనవరిలో 0.9 శాతం సానుకూల వృద్ధి తర్వాత బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు సహా అన్ని ప్రధాన విభాగాలు ఫిబ్రవరిలో క్షీణించాయి. గడిచిన ఆరు నెలల్లో ఇదే అత్యధికమని బుధవారం వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలిపాయి.

గతేడాది ఇదే నెలలో ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు 6.4 శాతంగా నమోదైంది. ఇక, ఫిబ్రవరి నెలకు సంబంధించి బొగ్గు ఉత్పత్తి 4.4 శాతం, ముడి చమురు 3.2 శాతం, సహజ వాయువు 1 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 10.9 శాతం, ఎరువులు 3.7 శాతం, ఉక్కు 1.8 శాతం, సిమెంట్ 5.5 శాతం, విద్యుత్ ఉత్పత్తి 0.2 శాతం ప్రతికూలంగా నమోదయ్యాయి. 2020-21లో ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య ఎనిమిది కీలక రంగాల వృద్ధి 8.3 శాతం తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 1.3 శాతం సానుకూలంగా నమోదైనట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed