వాళ్లు సంచరిస్తే సమాచారం ఇవ్వండి.. డీఎస్పీ భీమ్ రెడ్డి సూచన

by Shyam |
DSP Bhim Reddy
X

దిశ, పటాన్‌చెరు: పారిశ్రామికవాడలో అనుమానితులు సంచరించిస్తే పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పటాన్‌చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ప్రజలను కోరారు. శనివారం డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, 13 మంది ఎస్ఐలు, 90 మంది కానిస్టేబులతో ఆరు బృందాలుగా మండలంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ఎలాంటి పత్రాలు లేకుండా, అనుమానాస్పదంగా ఉన్న 24 ద్విచక్ర వాహనాలు, ఏడు ఆటోలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నలుగురు అనుమానితులను విచారించి వదిలివేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ భీమ్ రెడ్డి మాట్లాడుతూ.. పండుగను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తలో భాగంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. పోలీసులు ప్రజలకు చేరువ అయ్యే విధంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాత నేరస్తులు అనుమానితులు సంచరించిన వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story