ఆన్‌లైన్‌లో ఏసీ, ఫ్రిజ్‌లకు భారీ డిమాండ్

by Harish |
ఆన్‌లైన్‌లో ఏసీ, ఫ్రిజ్‌లకు భారీ డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మహమ్మారి వల్ల ఇంటి నుంచే ఆన్‌లైన్ విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుండటంతో ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లలో కూలింగ్ అప్లయన్సెస్‌కు డిమాండ్ భారీగా పెరిగింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్లాట్‌ఫామ్‌లలో ఏసీ, ఫ్రిజ్‌ల డిమాండ్ మూడు రెట్లు పెరిగింది. వీటిలో ఫ్యాన్లు కూడా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఏసీల డిమాండ్ 4 రెట్లు పెరిగింది. మిగిలిన విభాగాలు 3 రెట్ల వరకు పెరిగాయి. ‘గడిచిన 3-4 నెలల వ్యవధిలో ఎయిర్ కండీషనర్, రీఫ్రిజిరేట్ల డిమాండ్ 25 శాతం వృద్ధి నమోదైంది.

అమెజాన్‌లో ఏసీలకు 3 రేట్ల డిమాండ్, రెఫ్రిజిరేటర్లకు రెండు రెట్ల డిమాండ్ నమోదైంది. ఈ రెండు విభాగాలు ముఖ్యంగా 4,5 స్టార్ రేటేడ్ ఉత్పత్తులకు అధిక డిమాండ్ గమనించామని అమెజాన్ ప్రతినిధి సుచిత్ సుభాస్ చెప్పారు. ఈ ఏడాది కూడా ఇదే ధోరణి ఉంటుందని భావిస్తునట్టు’ పానాసోనిక్ ఇండియా సీఈఓ మనీష్ చెప్పారు.ఈ డిమాండ్ ధోరణి మెట్రోలకు మాత్రమే పరిమితం కాలేదని, చిన్న నగరాలు, టైర్2, టైర్3 నగరాల్లో ఈ వృద్ధికి దోహదపడ్డాయని’ ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి హరి జి కుమార్ తెలిపారు. డిమాండ్ కేవల ఏసీలకు మాత్రమే పరిమితం కాలేదని, ఫ్రిజ్‌ల డిమాండ్ 30 శాతం రికార్డు వృద్ధిని సాధించాయని, ముఖ్యంగా గత సంవత్సరాల కంటే ఈ వృద్ధి భిన్నమని, దక్షిణ ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉన్నట్టు గుర్తించామని వోల్టాస్ ప్రతినిధి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed