- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్రిస్మస్‌కు వచ్చేస్తున్న ‘కూలీ నం.1’

దిశ, వెబ్‌డెస్క్ :
బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరో వరుణ్ ధావన్ సూపర్ ఫన్‌తో వచ్చేస్తున్నాడు. తండ్రి డేవిడ్ ధావన్ డైరెక్షన్‌లో ‘కూలీ నం. 1’ సినిమా ద్వారా మస్త్ ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. ఈ క్రమంలో డిఫరెంట్ చిల్లింగ్ అవతార్స్‌లో హీరోయిన్ సారా అలీ ఖాన్‌ను మోస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసిన వరుణ్.. సినిమా అప్‌డేట్ ఇచ్చాడు.
‘కూలీ నం.1.. గ్రామాల్లో మిఠాయి పంచండి.. పట్టణాల్లో దండోరా వేయించండి.. రాజు వచ్చేస్తున్నాడు అని అందరికీ చెప్పండి..’ అంటూ సోషల్ మీడియాలో న్యూ పోస్టర్ షేర్ చేసిన వరుణ్.. నవంబర్ 28న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు. అమెజాన్ ప్రైమ్‌లో కలుద్దాం అంటూ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల చేస్తామని తెలిపాడు.
కూలీ నం.1 డేవిడ్ ధావన్‌కు 45వ సినిమా కాగా, 1995లో సేమ్ టైటిల్‌తో వచ్చిన మూవీకి రీమేక్. ఒరిజినల్ మూవీలో గోవింద, కరిష్మా కపూర్ జంటగా నటించగా.. ఇదే సినిమాను రీమేక్ చేసేందుకు దాదాపు ఆరు నెలలు స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు తెలిపారు డైరెక్టర్. వరుణ్, సారా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఫ్రెష్ ఫీల్ ఇస్తుందన్నారు.